తెలంగాణ

telangana

By

Published : Jul 30, 2020, 9:52 AM IST

Updated : Jul 30, 2020, 2:25 PM IST

ETV Bharat / business

లోహ రంగ​ షేర్లపై అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో​ మార్కెట్లు

Stock markets live updates
అంతర్జాతీయ సానుకూలతలతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

14:21 July 30

నష్టాల్లో మార్టెట్లు

లోహ రంగ షేర్లపై ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 297 పాయింట్ల నష్టంతో 37,773వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 87 పాయింట్లు కోల్పోయి 11,115వద్ద కొనసాగుతోంది.

13:31 July 30

విక్రయాలతో నష్టాలు

బ్యాంకింగ్, విద్యుత్​​ రంగ షేర్ల విక్రయాల ఒత్తిడితో స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 22 పాయింట్ల నష్టపోయి 38,048 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 20పాయింట్లు నష్టపోయి 11,183 వద్ద ట్రేడ్​ అవుతోంది.

అయితే ఐటీ, ఫార్మా షేర్లు కొనుగోళ్లు నమోదు చేస్తున్నాయి.

12:20 July 30

ఐటీ షేర్ల దూకుడు...

ఐటీ షేర్ల దూకుడుతో దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 247 పాయింట్లు వృద్ధి చెంది 38,318 వద్ద కొనసాగుతోంది. 67 పాయింట్ల లాభంతో ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 11,270 వద్ద ట్రేడ్​ అవుతోంది.

09:44 July 30

భారీ లాభాల దిశగా స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూలతలు, ఫెడ్​ వడ్డీ రేట్ల ప్రకటనలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 240 పాయింట్లు వృద్ధి చెంది 38,311 వద్ద కొనసాగుతోంది. 60 పాయింట్ల లాభంతో ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 11,263 వద్ద ట్రేడ్​ అవుతోంది.

Last Updated : Jul 30, 2020, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details