తెలంగాణ

telangana

ETV Bharat / business

అదే భయం.. స్టాక్​ మార్కెట్లు మళ్లీ పతనం

sensex
సెస్సెక్స్​

By

Published : Apr 24, 2020, 9:18 AM IST

Updated : Apr 24, 2020, 3:50 PM IST

15:48 April 24

అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాలు, కరోనా భయాలతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. 2 రోజుల వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 535 పాయింట్ల నష్టంతో 31,327 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 159  పాయింట్లు క్షీణించి..9,154 వద్ద ముగిసింది.

లాభాల్లో..

రిలయన్స్​, బ్రిటానియా, సిప్లా, సన్​ఫార్మా, హీరోమోటోకార్ప్​ షేర్లు లాభాలతో ముగించాయి.

నష్టాల్లో...

బజాజ్​ఫైనాన్స్​, జీల్​, హిందాల్కో, ఇన్​ఫ్రాటెల్​ షేర్లు నష్టాలు చవిచూశాయి.

ప్రపంచ మార్కెట్లు...

కరోనా దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఫ్రాన్స్​, జర్మనీ, బ్రిటన్​ మార్కెట్లు 1.5 శాతంపైనే నష్టాలను నమోదు చేశాయి.

ఆసియా మార్కెట్లు నిక్కీ (0.9%), కొస్పీ (1.3%), హాంగ్​సెంగ్ (0.6%)​, షాంఘై (1.1%) మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

కరోనా వైరస్​ వ్యాక్సిన్​ పురోగతిపై సందేహాలు మదుపరుల్లో ఆందోళన పెంచాయి. చైనా చేసిన క్లినికల్​ ట్రైల్​లో వ్యాక్సిన్​ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం మార్కెట్ల పతనానికి ఓ కారణమైంది.

రూపాయి....

డాలరుతో పోలిస్తే రూపాయి 40 పైసలు క్షీణించి రూ.76.46 వద్ద నిలిచింది.

చమురు...

బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్​కు 20.89 డాలర్లకు చేరింది.

10:34 April 24

దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి.  సెన్సెక్స్ 443 పాయింట్లు కోల్పోయి 31,419 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయి 9,185 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో...

సిప్లా, బ్రిటానియా, సన్‌ ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, నెస్లే, హీరోమోటోకార్ప్​ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

నష్టాల్లో...

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతోనే ముగిశాయి.  

కారణాలు...

  1. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందన్న భయాలు.
  2. వైరస్‌కు సంబంధించిన ఔషధాల తయారీ పురోగతిలో నెలకొన్న అనుమానాలు.
  3. అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో కుంగిపోయిందన్న తాజా నివేదికలు మదుపర్లను ప్రభావితం చేస్తున్నాయి.

రూపాయి...

డాలరుతో రూపాయి మారకం విలువ వద్ద రూ.75.29 కొనసాగుతోంది.  

చమురు...

బ్రెంట్ ముడి చమురు ధర 5.91 శాతం పెరిగి బ్యారెల్​కు 22.59 డాలర్లకు చేరింది.

09:16 April 24

మాంద్యం మేఘాలు: సెన్సెక్స్ 500 పాయింట్లు పతనం

కరోనా సంక్షోభంతో ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. ఫలితంగా స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పతనమై 31 వేల 380 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు తగ్గి 9,185 వద్ద ట్రేడవుతోంది. 

Last Updated : Apr 24, 2020, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details