భారీ పతనం...
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,203 పాయింట్లు కోల్పోయి 28,265 వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ 343 పాయింట్లు క్షీణించి 8,253 వద్ద నిలిచింది.
15:36 April 01
భారీ పతనం...
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,203 పాయింట్లు కోల్పోయి 28,265 వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ 343 పాయింట్లు క్షీణించి 8,253 వద్ద నిలిచింది.
13:22 April 01
1200 పాయింట్లు కోల్పోయి...
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో సాగుతున్నాయి. సెన్సెక్స్ 1183 పాయింట్లు కోల్పోయి 28,284 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 346 పాయింట్లు క్షీణించి 8,251 వద్ద కొనసాగుతోంది.
11:44 April 01
భారీ నష్టాల్లో...
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 1019 పాయింట్లు కోల్పోయి 28,448 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 295 పాయింట్లు క్షీణించి 8,302 వద్ద సాగుతోంది.
10:24 April 01
కొత్త వార్షిక ఏడాదికి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో స్వాగతం పలికాయి. కరోనా భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 714 పాయింట్లు కోల్పోయి 28,753 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 199 పాయింట్లు క్షీణించి 8,398 వద్ద కొనసాగుతోంది.
నష్టాల్లో...
కొటక్ బ్యాంక్ షేర్లు 8 శాతం మేర నష్టపోయాయి. ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
లాభాల్లో...
హిమాద్రి స్పెషాలిటీ, జుబిలియంట్ లైఫ్ సైన్సెస్, సుప్రజిత్ ఇంజినీరింగ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా అడ్వాన్స్‌డ్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.
కారణం...
రూపాయి...
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.74 వద్ద ట్రేడవుతోంది.
చమురు ధరలు...
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ 0.76 శాతం తగ్గింది. బ్యారెల్ ముడిచమురు ధర 26.15 డాలర్లకు చేరింది.
09:45 April 01
నష్టాల పయనం...
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 652 పాయింట్లు కోల్పోయి 28,816 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 190 పాయింట్లు క్షీణించి 8,407 వద్ద సాగుతోంది.
09:18 April 01
మాంద్యం భయాలతో స్టాక్ మార్కెట్లకు నష్టాలు
కరోనా సంక్షోభంతో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాల మధ్య... స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా నష్టంతో 29 వేల 160 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయిట్లు తగ్గి 8 వేల 490 వద్ద కొనసాగుతోంది.