తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ ఒత్తిళ్లతో నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Jul 29, 2020, 9:49 AM IST

Updated : Jul 29, 2020, 11:21 AM IST

Stock markets live page
అంతర్జాతీయ ఒత్తిళ్లతో నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

11:06 July 29

అంతర్జాతీయ ఒత్తిళ్లతో నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో 100 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ క్రమంలో నష్టాల్లోకి జారుకుంది. యూఎస్ ఫెడరల్ బ్యాంకు పాలసీ ప్రకటనకు ముందు మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 144 పాయింట్లు కోల్పోయి 38 వేల 348 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 11 వేల 275 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

ఇండస్​ఇండ్ బ్యాంకు, టాటాస్టీల్​, ఎల్​ అండ్ టీ, ఎస్​బీఐ, సన్​ఫార్మా, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు రాణిస్తున్నాయి.

నెస్లే ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

అంతర్జాతీయ మార్కెట్లు

షాంఘై, హాంగ్​కాంగ్​, సియోల్​ స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండగా... టోక్యో నష్టాల్లో ట్రేడవుతోంది. మరోవైపు వాల్​స్ట్రీట్ నష్టాలతో ముగిసింది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.11 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 43.66 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ

రూపాయి విలువ 6 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.74.78గా ఉంది.

09:40 July 29

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల అంశాలతో స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 130 పాయింట్లు నష్టపోయి 38,362 వద్ద ట్రేడ్​ అవుతోంది. 25 పాయింట్లు పడిపోయిన ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 11,280 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Jul 29, 2020, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details