తెలంగాణ

telangana

ETV Bharat / business

సంపన్నులపై సర్​ఛార్జ్​​ బాదుడుతో భారీ నష్టాలు - nifty

సంపన్నులపై అధిక పన్ను భారం మోపేలా బడ్జెట్​లో చేసిన ప్రకటనలు సహా అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ దాదాపు 900 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 250 పాయింట్లు తగ్గింది.

స్టాక్​ మార్కెట్

By

Published : Jul 8, 2019, 9:52 AM IST

Updated : Jul 8, 2019, 3:14 PM IST

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ దాదాపు 900 పాయింట్లు నష్టంతో 38 వేల 650 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 250 పాయింట్లతో 11 వేల 545 వద్ద కొనసాగుతోంది.

2019లో సెన్సెక్స్​ ఒకే రోజున ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి.

ఇవీ కారణాలు...

అధిక ఆదాయం కలిగిన వారిపై సర్​ఛార్జిని పెంచుతూ బడ్జెట్​లో కీలక ప్రకటన చేసింది కేంద్రం. విదేశీ మదుపర్లు, సంపన్నులపై పన్ను భారం పెంచే ఈ నిర్ణయం మదుపర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది.

అమెరికాలో ఉద్యోగ గణాంకాలు మెరుగైన నేపథ్యంలో ఫెడరల్​ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తుందన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపాయి.

ఫలితంగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎల్ అండ్​ టీ, బజాజ్​ ఫినాన్స్​ వంటి దిగ్గజ సంస్థల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.

Last Updated : Jul 8, 2019, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details