దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లుకు పైగా లాభపడింది. ఈ దశలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు డీలాపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజి సూచీ సెన్సెక్స్ 31పాయింట్లు తగ్గి... 50 వేల 363 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 19 పాయింట్లు పడిపోయి 14 వేల 910 వద్ద సెషన్‌ను ముగించింది.
ఐటీ షేర్లు రాణించగా.. ఆర్థిక షేర్లు నష్టాలను చవి చూశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,857 అత్యధిక స్థాయిని; 50,289 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.