స్టాక్‌మార్కెట్లు ఇవాళ లాభాల్లో దూసుకెళ్లాయి. సూచీలు రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకాయి. బ్యాంకింగ్, స్థిరాస్తి, లోహ రంగం షేర్ల దూకుడుతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. కరోనా టీకాపై ఆశలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ ఒక దశలో 440 పాయింట్లకుపైగా పెరిగి.. 46 వేల 705 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. సెషన్ చివరకు 403 పాయింట్ల లాభంతో.. 46 వేల 666 వద్ద ముగిసింది.
నిఫ్టీ 115 పాయింట్లు పెరిగింది. 13 వేల 63 వద్ద సెషన్‌ను ముగించింది.