రుతుపవనాల కదలికలో వేగవంతమైన పురోగతి.. మదుపర్లలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. విద్యుత్, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లు లాభాలను గడించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 312 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆరంభంలో 38 వేల 946 పాయింట్ల కనిష్ఠాన్ని చేరిన సెన్సెక్స్.. 500 పాయింట్లకు పైగా మెరుగుపడి 39 వేల 490 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. సెషన్ చివరకు 39 వేల 434 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 97 పాయింట్లు మెరుగుపడింది. ఇంట్రాడేలో 11,651-11, 814 మధ్య కదలాడింది నిఫ్టీ.
మధ్యాహ్న సెషన్లో.. బ్యాంకింగ్, లోహ, స్థిరాస్తి రంగాల్లో కొనుగోళ్లు మార్కెట్లకు ఊతం అందించాయి.