తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market: పట్టుబిగించిన బేర్​- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు - స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్

Stocks live
స్టాక్​ మార్కెట్స్​ లైవ్​

By

Published : Nov 22, 2021, 9:34 AM IST

Updated : Nov 22, 2021, 3:51 PM IST

15:47 November 22

స్టాక్ మార్కెట్లు భారీ​ నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 1170 పాయింట్ల పతనమై.. 58,466 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 348 పాయింట్లు కోల్పోయి.. 17,417 వద్ద ముగిసింది.

14:02 November 22

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా పతనమై.. 58 వేల 138 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 438 పాయింట్లు కోల్పోయి 17 వేల 326 వద్ద ట్రేడ్​ అవుతోంది. 

13:47 November 22

గత నెల జీవితకాల గరిష్ఠాలకు చేరిన సూచీలు.. కొన్ని రోజుల నుంచి దిగజారుతూ వస్తున్నాయి. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో పాటు దేశీయంగా ఫలితాల సీజన్‌ ముగియడం వల్ల మార్కెట్లకు మద్దతు లభించడం లేదు. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సూచీలను మరింత దెబ్బతీస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా తగ్గి 58 వేల 410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 350 పాయింట్లు క్షీణించి 17 వేల 415 వద్ద ఉంది. 

బ్యాంకింగ్, ఆటో, స్థిరాస్తి రంగాలు ఒత్తిడిలో ట్రేడవుతున్నాయి.​

  • సెన్సెక్స్​ 30 సూచీలో భారతీ ఎయిర్​టెల్,​ ఏసియన్​ పెయింట్​, పవర్​గ్రిడ్​ మినహా మిగిలినవి నష్టాల్లో ఉన్నాయి.
  • బజాజ్​ జంట, రిలయన్స్​, టైటాన్​, ఎస్​బీఐఎన్​, మారుతీ షేర్లు ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

12:10 November 22

అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్లు(Stock Market) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​(Sensex Today) 1000 పాయింట్లపైగా కోల్పోయి.. 58,576 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ(Nifty today) 310 పాయింట్ల నష్టంతో 17,454 వద్ద కదలాడుతోంది.

సెన్సెక్స్​ 30 సూచీలో భారతీ ఎయిర్​టెల్​, ఏషియన్​ పెయింట్​, పవర్​గ్రిడ్​, టీసీఎస్​ షేర్లు మినహా మిగిలినవి నష్టాల్లో కొనసాగుతున్నాయి.

10:42 November 22

మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరగడం మార్కెట్​ సెంటిమెంటును దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కూడా సూచీల పతనానికి కారణమవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆటో, ఆయిల్​ అండ్​ గ్యాస్​, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు ఒక శాతం పతనమయ్యాయి. 

బీఎస్ఈ-సెన్సెక్స్​ 630 పాయింట్లకుపైగా కోల్పోయి 58,958 వద్ద కదలాడుతోంది. నిప్టీ 190 పాయింట్లు నష్టపోయి 17,573 వద్ద కొనసాగుతోంది.

09:03 November 22

నష్టాల్లో స్టాక్​మార్కెట్​ సూచీలు

స్టాక్ ​మార్కెట్లు (Stock market news) సోమవారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్(Sensex today) 450 పాయింట్లకుపైగా పతనమై 59,161 వద్ద కొనసాగుతోంది. మరో సూచీ నిఫ్టీ (Nifty today) 100 పాయింట్లకుపైగా కోల్పోయి 17,644 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో సూచీలు ఒడుదొడుకుల్లో కదలాడుతున్నాయి.

  • భారతీ ఎయిర్​టెల్​, ఇండస్​ఇండ్​బ్యాంకు, పవర్​గ్రిడ్​, ఏసియన్​ పెయింట్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • రిలయన్స్​ మారుతీ, బజాజ్​ ఫైనాన్స్​, కొటక్​ బ్యాంకు, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఎం అండ్​ ఎం షేర్లు ఎక్కువగా నష్టాల్లో కదలాడుతున్నాయి.
Last Updated : Nov 22, 2021, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details