తెలంగాణ

telangana

ETV Bharat / business

కుదిపేసిన బ్యాంకింగ్ షేర్లు- మార్కెట్లకు భారీ నష్టాలు - బీఎస్​ఈ సెన్​సెక్స్​

stocks live updates
స్టాక్​ మార్కెట్​ లైవ్​

By

Published : Jul 19, 2021, 9:32 AM IST

Updated : Jul 19, 2021, 3:44 PM IST

15:40 July 19

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 587 పాయింట్లు తగ్గి 52,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 171 పాయింట్లు నష్టపోయి.. 15,752 వద్దకు చేరింది.

  • ఎన్​టీపీసీ, నెస్లే, డాక్టర్​ రెడ్డీస్, సన్​ఫార్మా, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాలను గడించాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, మారుతీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

14:32 July 19

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి. సెన్సెక్స్ 670 పాయింట్లకుపైగా కోల్పోయి 52,465 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 190 పాయింట్లకుపైగా పతనంతో 15,728 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.

  • ఎన్​టీపీసీ, నెస్లే ఇండియా మినహా 30 షేర్ల ఇండెక్స్​లోని కంపెనీలన్నీ నష్టాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:57 July 19

స్టాక్​ మార్కెట్​ లైవ్​

స్టాక్ మార్కెట్లు ఈ వారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 345 పాయింట్ల నష్టంతో 52,794 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 100 పాయింట్లకుపైగా నష్టంతో 15,823 వద్ద కొనసాగుతోంది.

ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​ టెక్​, టైటాన్​, టీసీఎస్​​, నెస్లే షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ, ఎస్​బీఐఎన్​, యాక్సిస్​ బ్యాంక్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎల్​టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

Last Updated : Jul 19, 2021, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details