తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- నిఫ్టీ 150 మైనస్​ - ఎన్​ఎస్​ఈ స్టాక్స్​

stocks, live updates
స్టాక్స్​ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Jan 28, 2021, 9:27 AM IST

Updated : Jan 28, 2021, 3:43 PM IST

15:39 January 28

హెచ్​యూఎల్​ 3.6% మైనస్..

స్టాక్ మార్కెట్లు వరుసగ ఐదో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు తగ్గి 46,874 వద్ద ముగిసింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 13,817 వద్ద స్థిరపడింది.  

  • యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్​టీపీసీ షేర్లు లాభపడ్డాయి.
  • హెచ్​యూఎల్​, మారుతీ, హెచ్​సీఎల్​టెక్, పవర్​గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన.. షాంఘై, టోక్యో సియోల్, హాంకాంగ్ సూచీలు భారీ​​ నష్టాలను నమోదు చేశాయి.

13:56 January 28

నష్టాల్లోనే మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ దాదాపు 600 పాయింట్ల నష్టంలో ఉంది. ప్రస్తుతం.. 46 వేల 800 ఎగువన ట్రేడవుతోంది.

నిఫ్టీ 180 పాయింట్లు కోల్పోయి.. 13 వేల 790 వద్ద ఉంది.

లాభనష్టాల్లో..

యాక్సిస్​ బ్యాంక్​, హీరో మోటోకార్ప్​, బీపీసీఎల్​, ఐఓసీ, ఎస్​బీఐ లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, విప్రో, టెక్​ మహీంద్రా, హెచ్​యూఎల్​, కోటక్​ మహీంద్రా డీలా పడిపోయాయి. 

12:45 January 28

30 షేర్ల ఇండెక్స్

13,750 దిగువకు నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​ తర్వాత భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 780 పాయింట్లకుపైగా నష్టపోయి.. 46,629 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 210 పాయింట్లకుపైగా కోల్పోయి 13,725 వద్ద ట్రేడవుతోంది.

యాక్సిస్ బ్యాంక్, ఓఎన్​జీసీ, మారుతీ, ఎం&ఎం మినహా 30 షేర్ల ఇండెక్స్​లో అన్ని కంపెనీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:42 January 28

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 3.5 % పతనం..

స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. మిడ్​ సెషన్​కు ముందు సెన్సెక్స్​ 460 పాయింట్లకుపైగా కోల్పోయి 46,945 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 130 పాయింట్ల నష్టంతో 13,840 వద్ద కొనసాగుతోంది. 

నేటితో (గురువారం) జనవరి డెరివేటివ్​ కాంట్రాక్టులు ముగియనుండటం వల్ల అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపరులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ కారణాలన్నీ మార్కెట్లను భారీ నష్టాల్లోకి నెడుతున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

దాదాపు అన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • యాక్సిస్​ బ్యాంక్, ఓఎన్​జీసీ, మారుతీ, రిలయన్స్​ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పవర్​గ్రిడ్, టెక్ మహీంద్రా, హెచ్​యూఎల్​, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:44 January 28

భారీ నష్టాల్లో మార్కెట్లు- 13 వేల 900 దిగువకు నిఫ్టీ

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు కుదేలవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభ ట్రేడింగ్​లోనే 500 పాయింట్లకుపైగా కోల్పోయింది.

ప్రస్తుతం 530 పాయింట్లకుపైగా నష్టంతో.. 46 వేల 875 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ.. 140 పాయింట్లు క్షీణించి.. 13 వేల 830 దిగువకు చేరింది.

లాభనష్టాల్లో..

సెన్సెక్స్​ 30 ప్యాక్​లో ఓఎన్​జీసీ, యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో, రిలయన్స్​, ఎస్​బీఐ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. 

Last Updated : Jan 28, 2021, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details