దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వాహన, బ్యాంక్ రంగాల్లో ఒత్తిళ్లతో ఒడుదొడుకులకు గురైన దేశీయ సూచీలు.. ఎఫ్‌ఎమ్‌జీసీ, ఐటీ షేర్ల దూకుడుతో చివిరి నిమిషంలో లాభాలను నమోదు చేశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 60 పాయింట్లు వృద్ధి చెంది 38,417 వద్ద స్థిరపడింది. 21 పాయింట్లు మెరుగుపడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,355కు చేరింది.
లాభానష్టాలు...
టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్‌సీఎల్‌టెక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టాటాస్టీల్, మారుతి షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ఎమ్, హెచ్డీఎప్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఓన్జీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.