లాభాల్లో మార్కెట్లు..
ఐటీ, విద్యుత్ రంగ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్ 254 పాయింట్లు లాభపడి 38,671 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ 57 పాయింట్లు మెరుగై 11,412 పాయింట్లకు చేరుకుంది.
10:43 September 08
లాభాల్లో మార్కెట్లు..
ఐటీ, విద్యుత్ రంగ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్ 254 పాయింట్లు లాభపడి 38,671 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ 57 పాయింట్లు మెరుగై 11,412 పాయింట్లకు చేరుకుంది.
09:35 September 08
భారత్- చైనా ఉద్రిక్తతలు..
అంతర్జాతీయ ప్రతికూలతలు, భారత్- చైనా ఉద్రిక్తతల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 74 పాయింట్లు పెరిగి 38491 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 4 పాయింట్లు మెరుగై 11,359 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో..
టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
పవర్‌గ్రిడ్, కొటక్ బ్యాంక్, నెస్లే, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఐటీసీ నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉండగా... దక్షిణ కొరియా, జపాన్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.
అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి.
చమురు..
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురు ధర స్వల్పంగా తగ్గి బ్యారెల్‌కు 41.95 డాలర్ల వద్ద స్థిరపడింది.