తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల్లో సూచీలు-15వేల మార్కుకు చేరువలో నిఫ్టీ

STOCK MARKET LIVE UPDATES ON TUESDAY MARCH 16TH
పుంజుకున్న ఆర్థిక షేర్లు-లాభాల్లో మార్కెట్లు

By

Published : Mar 16, 2021, 9:25 AM IST

Updated : Mar 16, 2021, 10:48 AM IST

10:33 March 16

లాభాల్లో సూచీలు-15వేల మార్కును తాకిన నిఫ్టీ

భారీ ఒడుదొడుకుల నుంచి కోలుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 411 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం 50,806 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్సేంజీ-నిఫ్టీ 108పాయింట్ల లాభంతో 15,038 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

టైటాన్​, బజాజ్ ఫినాన్స్​, హెచ్​డీఎఫ్​సీ,  ఏసియన్​ పెయింట్స్​, టెక్​ మహేంద్ర, ​ఇన్ఫోసిస్​,హెచ్​సీఎల్​ టెక్,మారుతి, భారతీ ఎయర్​టెల్,​ పవర్​గ్రిడ్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో సన్ ఫార్మా, ఎస్​బీఐ, బజాజ్​ ఆటో షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:08 March 16

స్టాక్​ మార్కెట్స్​ లైవ్ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 192పాయింట్లకు పైగా లాభంతో.. 50 వేల 587 ఎగువన ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 14 వేల 982 వద్ద కొనసాగుతోంది. 

లాభనష్టాల్లో..

టైటాన్​, బజాజ్ ఫినాన్స్​, హెచ్​డీఎఫ్​సీ,  ఏసియన్​ పెయింట్స్​, టెక్​ మహేంద్ర, ​ఇన్ఫోసిస్​, సన్​ఫార్మా, పవర్​గ్రిడ్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఐటీసీ,ఎస్​బీఐ, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, కోటక్​ బ్యాంక్​​​ డీలాపడ్డాయి.

Last Updated : Mar 16, 2021, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details