Stock Market closing: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్‌ను లాభాలతో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 936 పాయింట్లకు పైగా ఎగబాకి 56,486 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ కూడా 241 పాయింట్లు వృద్ధి చెంది 16,871 వద్ద ట్రేడింగ్ ముగించింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 56,546 పాయింట్ల అత్యధిక స్థాయి, 55,556 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,888 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,606 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభానష్టాలు..
ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి.
హిందుస్థాన్ యూనిలివర్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్టీస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఆర్‌బీఐ ఆంక్షలతో కుదేలైన పేటీఎం షేరు...
కొత్త ఖాతాలు తెరవడం నిలిపివేయాల్సిందిగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది. దీంతో సోమవారం కంపెనీ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఓ దశలో 12 శాతానికి పైగా కుంగి రూ.662 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి స్టాక్ ధర 12.24 శాతం మేర నష్టపోయి రూ.680 వద్ద స్థిరపడింది. ఇష్యూ ధరతో పోలిస్తే.. ఈ స్టాక్ ఇప్పటి వరకు 70 శాతానికి పైగానే క్షీణించింది.
ఇదీ చూడండి:
ఎల్‌ఐసీ ఐపీఓకి మే 12 వరకే గడువు.. ఆ తర్వాత..