అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడ్డా... దేశీయంగా సానుకూల పరిస్థితులు నెలకొన్న వేళ స్టాక్మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా పెరిగి 39 వేల 40 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 11 వేల 630 వద్ద ట్రేడవుతోంది.
బ్యాంకింగ్ రంగాల వాటాల కొనుగోలుకు మదుపర్లు అమితాసక్తి చూపుతున్నారు.
ఇవీ కారణాలు...
* దిగ్గజ ఐటీ సంస్థలు తొలి త్రైమాసికంలో సంతృప్తికర స్థాయిలో లాభాలు ఆర్జించడం మదుపర్లలో ఉత్సాహం నింపింది.
* టోకు ధరల ద్రవ్యోల్బణం 23 నెలల కనిష్ఠ స్థాయికి దిగిరావడం దేశ స్థూల ఆర్థిక పరిస్థితిపై మదుపర్లలో భరోసా పెంచింది.