తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాలకు బ్రేక్- 50వేల ఎగువకు సెన్సెక్స్

స్టాక్​ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 280 పాయింట్లు బలపడి.. 50,051 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి.. 14,810 వద్దకు చేరింది.

Share Market LIVE: Sensex crosses 50,100, Nifty above 14,800; Titan shares jump 3%
లాభాల్లో స్టాక్​ మార్కెట్లు-సెన్సెక్స్ 341 పాయింట్లు ప్లస్​

By

Published : Mar 23, 2021, 3:40 PM IST

వరుస నష్టాలకు బ్రేకులు వేస్తూ.. స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్​ను లాభాలతో ముగించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 280 పాయింట్లు బలపడి.. 50,051 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 14,814 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులు, కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళనలు ఉన్నా... ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలోపేతం లాభాలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,264 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,662 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,879 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,707 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో ఉన్న షేర్లు..

  • అల్ట్రాటెక్​ సిమెంట్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్,​ షేర్లు భారీగా లాభాపడ్డాయి.
  • ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్​, ఐటీసీ, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ, షేర్లు నష్టపోయాయి.

ఇదీ చదవండి:భారత్​ ఆశలకు కరోనా గండి- లక్ష్య సాధన మూడేళ్లు ఆలస్యం!

ABOUT THE AUTHOR

...view details