తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల అమ్మకాలతో నష్టాలు - షేర్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, వాహన రంగాలు, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో భారీగా అమ్ముడుకావడం, వాహనరంగంలో నష్టాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీయడమే ఇందుకు కారణం.

బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల అమ్మకాలతో నష్టాలు

By

Published : Jul 30, 2019, 5:04 PM IST

బ్యాంకింగ్, వాహన రంగాలు, ఆయిల్​ అండ్ గ్యాస్​ షేర్లలో భారీ అమ్మకాలు జరగడం వల్ల ఇవాళ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. వాహన రంగ నష్టాలు మదుపరుల సెంటిమెంటును దెబ్బతీయడం ఇందుకు మరోకారణం. విదేశీ మదుపరులు పెట్టుబడి ఉపసంహరణలను కొనసాగించడమూ దేశీయ మార్కెట్​ను దెబ్బతీసింది.

బీఎస్సీ సెన్సెక్స్​ 289.13 పాయింట్లు నష్టపోయి 37 వేల 397 వద్ద ముగిసింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ 103.80 పాయింట్లు కోల్పోయి 11 వేల 85 వద్ద నిలిచింది.

నష్టాల్లో..

యెస్​ బ్యాంకు భారీగా 9.13 శాతం నష్టపోయింది. ఇండస్​ఇండ్ బ్యాంకు 6.6 శాతం, హీరోమోటోకార్ప్ 6.01 శాతం, సన్​ఫార్మా 4.79 శాతం, ఎస్బీఐ 4.70 శాతం నష్టాలు చవిచూశాయి.

టాటా స్టీల్​, వేదాంత, టాటా మోటార్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా నష్టాల పాలయ్యాయి.

లాభాలతో గట్టెక్కాయ్​..

భారతీ ఎయిర్​టెల్ 3.19 శాతం, టీసీఎస్ 2.32 శాతం​ లాభాలు ఆర్జించాయి.

హెచ్​సీఎల్ టెక్, ఐటీసీ, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఎల్​ అండ్ టీ, హెచ్​యూఎల్​, ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.

ఆసియా మార్కెట్ల లాభాలు

అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ ప్రకటించనున్న నేపథ్యంలో మిగతా ఆసియా మార్కెట్లు.. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్, హాంగ్ సెంగ్, నిక్కీ, కోస్పీ లాభాలతో ముగిశాయి.

ఇదీ చూడండి: ఆగష్టు 7న భారత్​ మార్కెట్లోకి 'వివో ఎస్​1'

ABOUT THE AUTHOR

...view details