తెలంగాణ

telangana

ETV Bharat / business

వృద్ధి లెక్కలకు ముందు ఆచితూచి అడుగులు - ముడిచమురు

ప్రపంచ మార్కెట్ల మందగమనం, జీడీపీ వృద్ధి గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపరులు ముందుజాగ్రత్తగా వ్యవహరించారు. ఫలితంగా ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

వృద్ధి లెక్కలకు ముందు ఆచితూచి అడుగులు

By

Published : May 31, 2019, 5:32 PM IST

Updated : May 31, 2019, 5:45 PM IST

ఆద్యంతం ఒడుదొడుకులతో సాగిన సెషన్​లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ 117.77 పాయింట్లు కోల్పోయి 39 వేల 714.20 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 23.10 పాయింట్లు కోల్పోయి 11 వేల 922.80 వద్ద ముగిసింది.

జీడీపీ వృద్ధి గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు కాస్త ముందు జాగ్రత్త వహించడం ఇందుకు కారణం. ప్రపంచ మార్కెట్ల మందగమనం మరో కారణం. వాహన, ఆర్థిక రంగాల​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

వారం మొత్తంగా చూస్తే... సెన్సెక్స్​ 279.4 పాయింట్లు, నిఫ్టీ 78.70 పాయింట్లు లాభపడ్డాయి.

లాభ, నష్టాల్లో...

ఎస్​ బ్యాంకు సుమారు 4.27 శాతం నష్టపోయింది. ఐటీసీ, వేదాంత, ఎమ్​ అండ్ ఎమ్​ వాటా విలువ సుమారు 3.61 శాతం వరకు తగ్గాయి.

ఏషియన్​ పెయింట్స్​, టీసీఎస్​, హెచ్​సీఎల్​ టెక్​ సుమారు 2.43 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.

తగ్గిన ముడిచమురు ధరలు..

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు 2.60 శాతం క్షీణించాయి. ప్రస్తుతం బ్యారల్ ముడిచమురు ధర 63.62 డాలర్లుగా ఉంది.

పెరిగిన రూపాయి విలువ

అమెరికా డాలర్​లో పోల్చితే రూపాయి విలువ పెరిగి రూ.69.82లకు చేరుకుంది.

ఇదీ చూడండి: బిమ్​స్టెక్​ నేతలతో మోదీ స్నేహగీతం

Last Updated : May 31, 2019, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details