అమెరికా కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ రిజర్వ్' కీలక వడ్డీ రేట్లు తగ్గించడం... ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండనుందన్న భయాలను మరింత పెంచింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ ఒకానొక దశలో 2182 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం 1550 పాయింట్లకు పైగా నష్టపోయి 32, 547 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 430 పాయింట్లకు పైగా పతనమై 9515 వద్ద ట్రేడవుతోంది.
మదుపరుల సంపద ఆవిరి
తాజా మార్కెట్ నష్టాలతో రూ. 6.25 లక్షల కోట్ల విలువైన మదుపరుల సంపద ఆవిరైంది. ప్రారంభ సెషన్లో బీఎస్ఈలోని కంపెనీల షేర్ల విలువ రూ. 6,25, 501 కోట్ల మేర తగ్గి రూ. 1, 23, 00,741కు చేరుకుంది.
నష్టాల్లో ఉన్న షేర్లు
ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సహా సెన్సెక్స్ సూచీలోని 30 వ్యాపార సంస్థల షేర్లూ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు..