తెలంగాణ

telangana

ETV Bharat / business

పెద్దన్నల మధ్య కొత్త గొడవ- మార్కెట్లకు నష్టాలు - rupee value

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-చైనా మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. యూఎస్​ ఫెడరల్​ రిజర్వ్ సమావేశం నిర్ణయాలు కోసం వేచిఉండడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ... నష్టాలకు ఇతర కారణాలు.

పెద్దన్నల మధ్య కొత్త గొడవ- మార్కెట్లకు నష్టాలు

By

Published : Jul 31, 2019, 10:36 AM IST

దేశీయ స్టాక్​మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది. బీఎస్​ఈ సెన్సెక్​ 151.22 పాయింట్లు కోల్పోయి 37 వేల 246 వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 11 వేల 38 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా-చైనా వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమైనా హాంగ్​కాంగ్​ విషయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం మదుపర్ల సెంటిమెంట్​ను దెబ్బతీసింది. యూఎస్​ ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఫలితాల కోసం మదుపరులు వేచిచూడడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం... నష్టాలకు కారణమయ్యాయి.

లాభాల్లో

ఎస్​ బ్యాంకు, ఇండస్ఇండ్​ బ్యాంకు, సన్​ఫార్మా, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్ లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో

టెక్​మహీంద్ర, యాక్సెస్​ బ్యాంకు, బ్రిటానియా, సిప్లా, ఇన్ఫోసిస్​, టీసీఎస్, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో ఆసియా మార్కెట్లు

షాంఘై కాంపోజిట్, హాంగ్​సెన్, నిక్కీ, కోస్పీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

తగ్గిన రూపాయి విలువ

యూఎస్​ డాలర్​తో పోల్చుకుంటే రూపాయి విలువ 5 పైసలు తగ్గి, రూ.68.90గా ఉంది.

పెరిగిన ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.68 శాతం పెరిగి బ్యారెల్ 65.06 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: కాఫీడే సిద్ధార్థ మృతి- నది ఒడ్డున మృతదేహం

ABOUT THE AUTHOR

...view details