తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లలో జోష్ నింపిన ట్రంప్ ప్రకటన - సానుకూలత

స్టాక్​ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 200 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 60 పాయింట్ల వృద్ధితో 11,658 వద్ద ట్రేడవుతోంది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలే లాభాలకు కారణం.

dsd

By

Published : Apr 5, 2019, 10:57 AM IST

అంతర్జాతీయ సానుకూలతలు, లోహం, చమురు, బ్యాంకింగ్​ రంగం షేర్ల దూకుడుతో స్టాక్​ మార్కెట్లు లాభాల బాట పట్టాయి . సెన్సెక్స్​ 200 పాయింట్లు వృద్ధి చెంది 38,885 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 11,658 వద్ద ట్రేడవుతున్నాయి.

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే వార్తలతో ఆసియా మార్కెట్లు లాభాల్లో పరిగెడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరో నాలుగు వారాల్లో ఈ విషయమై కీలక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటన మదుపర్లలో ఉత్సాహం నింపింది.

లాభాల్లోనివివే...

ఇండస్​ఇండ్​ బ్యాంక్, యస్​ బ్యాంక్, ఇన్​ఫోసిస్, టీసీఎస్​, వేదాంత, ఎమ్​ అండ్​ ఎమ్​, ఐసీసీ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లోనివివే...

ఏషియన్​ పెయింట్స్​, హీరో మోటోకార్ప్​, భారతీ ఎయిర్​టెల్​, పవర్​ గ్రిడ్​, మారుతి, ఎస్​బీఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి..

మార్కెట్​ ఆరంభంలో రూపాయి విలువ 10 పైసలు మెరుగుపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.69.07గా ఉంది.

చమురు..

చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్యారెల్ ధర 69.22 డాలర్లకు చేరింది.

ABOUT THE AUTHOR

...view details