పెట్రో మంట భయంతో గత సెషన్లో నష్టాలు చవిచూసిన స్టాక్‌మార్కెట్లు నేడు కోలుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 100పాయింట్ల లాభంతో 38వేల 660వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30పాయింట్లు వృద్ధిచెంది 11వేల 605వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, గత రాత్రి అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలు నమోదుచేయడం నేటి లాభాలకు కారణం.
లాభ-నష్టాలు
ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, రిలయన్స్, పవర్‌గ్రిడ్, ఏసియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, యెస్ బ్యాంకు లాభాలతో ట్రేడవుతున్నాయి.
టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, వేదాంత, మారుతీ, టాటా స్టీల్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంకు, ఎస్బీఐ, బజాజ్ ఆటో, ఐటీసీ నష్టాలతో కొనసాగుతున్నాయి.