తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ నిధుల రాకతో లాభాల్లో సూచీలు

విదేశీ నిధుల ప్రవాహం వల్ల దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 122 పాయింట్ల వృద్ధితో 39,174 వద్ద సెన్సెక్స్​, 32 పాయింట్ల లాభంతో 11,619 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

విదేశీ నిధుల రాకతో లాభాల్లో సూచీలు

By

Published : Oct 18, 2019, 10:18 AM IST

విదేశీ నిధుల ప్రవాహంతో పాటు బ్యాంకింగ్​ రంగ షేర్ల దూకుడుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ పవనాలతో ప్రారంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. క్రమంగా లాభాల బాట పట్టాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్​ 122 పాయింట్ల లాభంతో 39వేల 174 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 32 పాయింట్ల వృద్ధి 11వేల 619 కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి...

ఎస్​ బ్యాంక్​, వేదాంత, హీరో మోటో కార్ప్​, పవర్​ గ్రిడ్​, ఎల్​అండ్​టీ, బజాజ్​ ఫినాన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు షేర్లు సుమారు 3 శాతం లాభపడ్డాయి. ఈ రోజు త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ షేర్లు 1 శాతం మేర పెరిగాయి.

భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​, ఎషియన్​ పేయింట్స్​ షేర్లు దాదాపు 1 శాతం మేర నష్టపోయాయి.

రూపాయి...

దేశీయ దిగుమతిదారుల నుంచి డాలర్​కు​ డిమాండ్​ పేరగటం వల్ల రూపాయి మారకపు విలువ తగ్గింది. డాలర్​తో పోలిస్తే 4 పైసలు తగ్గి రూ.71.20 వద్ద రూపాయి కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details