జీడీపీ వృద్ధి రేటు తగ్గుదల, ముడి చమురు ధరల పెరుగుదల, రుపాయి విలువ క్షీణత ఉన్నప్పటికీ... స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆటో, టెలికాం రంగ షేర్ల దూకుడు, ఆసియా మార్కెట్ల నుంచి వెలువడ్డ సానుకూల పవనాలే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 40,920 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 30 పాయింట్ల వృద్ధితో 12,080 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో..
భారతీ ఎయిర్టెల్ కాల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన అనంతరం ఆ సంస్థ షేరు విలువ 7.92 శాతం పెరిగింది. రిలయన్స్, టాటా మోటర్స్, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
టెక్ మహీంద్ర 2.55 శాతం మేర నష్టాలను మూటగట్టుకుంది. ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, సన్ ఫార్మాలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 4 పైసలు తగ్గి రూ.71.78 వద్ద కొనసాగుతోంది.