స్టాక్ మార్కెట్లు (Stock Market) శుక్రవారం లాభాలు గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 381 పాయింట్లు పెరిగి 60,059 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 105 పాయింట్ల లాభంతో 17,895 వద్దకు చేరింది.
ఆరంభం నుంచే సానుకూలంగా స్పందించిన సూచీలు.. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడిన తర్వాత భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 60,212 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,830 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,941 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,840 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.