తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ రెండు ప్రకటనలతో స్టాక్​ మార్కెట్లలో జోష్​

వరుస నష్టాల నుంచి స్టాక్​మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతల నడుమ స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.

స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 18, 2019, 10:29 AM IST

Updated : Oct 1, 2019, 1:00 AM IST

ముడి చమురు ధరల తగ్గుదల, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడడం ఖాయమన్న తాజా అంచనాలతో స్టాక్​మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ 50 పాయింట్ల లాభంతో 36 వేల 575 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 10 వేల 822 వద్ద కొనసాగుతోంది.

కారణాలు ఇవే...

  • డ్రోన్​ దాడుల నేపథ్యంలో నిలిచిన చమురు ఉత్పత్తిని సగం మేర పునరుద్ధరించినట్లు సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి చేసిన ప్రకటన సానుకూల ప్రభావం చూపింది. ఈ నెలాఖరులోగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందన్న అంచనాలతో ఇంధన రంగాల వాటాల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గుచూపారు.
  • అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం ఖాయమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు సానుకూల ప్రభావం చూపాయి.

లాభనష్టాల్లో...

బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్​​ ఇండస్ట్రీస్​, యస్​బీఐ, యస్​బ్యాంక్​, యాక్సిక్​ బ్యాంక్​, వేదాంత, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు 2శాతానికి పైగా వృద్ధి చెందాయి.

మారుతి, హీరో మోటార్స్, టాటా మోటార్స్​, హెచ్​యూఎల్, ఓఎన్​జీసీ షేర్లు 1.5 శాతం క్షీణించాయి.

ఇదీ చూడండి: కేంద్రం నుంచి త్వరలోనే భారీ ఉద్దీపన ప్యాకేజీ!

Last Updated : Oct 1, 2019, 1:00 AM IST

ABOUT THE AUTHOR

...view details