తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్​ మార్కెట్ల జోరు.. సెన్సెక్స్​ 400 ప్లస్​ - sesex

గ్లోబల్ ఈక్విటీలు సహా రిలయన్స్​ ఇండస్ట్రీస్ వంటి భారీ షేర్ల దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. 406 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్​ ప్రస్తుతం 41,385 వద్ద కొనసాగుతోంది. 123 పాయింట్లు లాభపడిన నిఫ్టీ.. 12,154 వద్ద ట్రేడవుతోంది.

Sensex rallies 328.54 pts to 41,308.16 in opening session; Nifty jumps 107.20 pts to 12,135.80. PTI
భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

By

Published : Feb 11, 2020, 9:47 AM IST

Updated : Feb 29, 2020, 11:03 PM IST

అంతర్జాతీయంగా కరోనా వైరస్ భయాలు నెలకొన్నప్పటికీ దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. గ్లోబల్ ఈక్విటీలు సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి భారీ షేర్ల దన్నుతో సెన్సెక్స్​ దూసుకెళ్తోంది. 406 పాయింట్ల వృద్ధితో 41,385 వద్ద సెన్సెక్స్​ ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో 12,154 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే

సెన్సెక్స్​లోని ముప్పై షేర్లలో దాదాపు అన్నీ లాభాల్లోనే పయనిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎస్​బీఐ, ఇండస్​ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగా వృద్ధి చెందాయి.

టీసీఎస్ షేర్లు మాత్రం నష్టాల బాట పట్టాయి.

ఆసియా మార్కెట్లు

షాంఘై, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సెలవు కారణంగా జపాన్ మార్కెట్లు తెరుచుకోలేదు. మరోవైపు వాల్​స్ట్రీట్​ స్టాక్​ ఎక్స్ఛేంజీ సోమవారం భారీ లాభాలు గడించాయి.

రూపాయి మారకం

అమెరికన్ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం 4 పైసలు బలహీనపడింది. ప్రస్తుతం 71.23 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 1.39 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 54.04 అమెరికన్ డాలర్లుగా ఉంది.

Last Updated : Feb 29, 2020, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details