స్థిరమైన విదేశీ పెట్టబడుల ప్రవాహం, అంతర్జాతీయ అనుకూలతల మధ్య స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 74.74 పాయింట్ల లాభంతో 38,841.85 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 20.85 పాయింట్ల స్వల్ప లాభంతో 11,664.30 వద్ద ట్రేడవుతోంది.
2019 మార్చి త్రైమాసికానికి రూ.8,126 కోట్ల నికర లాభం అర్జించినట్లు గత శుక్రవారమే ప్రకటించింది ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్). ఫలితంగా ఆ సంస్థ షేర్లు నేడు 3 శాతం వృద్ధితో కొనసాగుతున్నాయి.
లాభాల్లో ఉన్న మరిన్ని సంస్థలు
సెన్సెక్స్‌లో... కోల్ ఇండియా, టాటా మోటార్స్ , హెచ్‌సీఎల్ టెక్, వేదాంత, టాటాస్టీల్, హీరో మోటోకార్ప్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సంస్థల షేర్లు 4.12 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.