స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతోంది. వరుస లాభాలతో మార్కెట్లు మరోసారి రికార్డులు సృష్టించాయి. శుక్రవారం సెషన్లో బీఎస్ఈ సూచీ-సెన్సెక్స్ 117 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 50,731 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 14,924 వద్దకు చేరింది.
అంతర్జాతీయ సానుకూలతలకు తోడు బడ్జెట్ ఉత్సాహం లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫార్మా రంగం షేర్లు ప్రధానంగా లాభాలు గడించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 51,073 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 50,565 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,014 పాయింట్ల గరిష్ఠ స్థాయి (సరికొత్త రికార్డు ), 14,864 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.