స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 42 పాయింట్లు బలపడి 49,201 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 14,683 వద్ద ముగిసింది.
ఆరంభం నుంచి ఒడుదొడుల్లో కొనసాగినా సూచీలు చివరకు లాభాల్లో ముగియటం గమనార్హం. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, వాహన షేర్లు సానుకూలంగా స్పందించాయి. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 49,582 పాయింట్ల అత్యధిక స్థాయి: 48,936 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,779 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,573 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.