స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ (Sensex today) 123 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠ స్థాయి అయిన 53,493 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 36 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,294 వద్దకు చేరింది.
లాభాల స్వీకరణ కారణంగా ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. ఐటీ, హెవీ వెయిట్ షేర్ల దన్నుతో తిరిగి లాభాలను గడించాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 54,717 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవితకాల గరిష్ఠం) 54,230 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,349 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 16,210 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.