స్టాక్ మార్కెట్లు (Stock Market) వారాంతంలో డీలా పడ్డాయి. మదుపరుల అప్రమత్తతతో బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 126 పాయింట్లు తగ్గి 59,015వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 44 పాయింట్ల నష్టంతో 17,585 వద్దకు చేరింది.
ఇటీవలి భారీ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,737 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవనకాల గరిష్ఠం), 58,871 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,792 పాయింట్ల గరిష్ఠ స్థాయి(కొత్త రికార్డు), 17,537 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.