తెలంగాణ

telangana

ETV Bharat / business

వెంటాడిన యుద్ధ భయాలు- స్టాక్​ మార్కెట్లకు స్వల్ప నష్టాలు - రూపాయి మారకం

అమెరికా-ఇరాన్​ మధ్య యుద్ధ భయాలు పెరిగిన నేపథ్యంలో ప్రపంచమార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 52 పాయింట్లు కోల్పోగా... జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 28 పాయింట్లు పతనమైంది.

Sensex ends 51.73 pts lower at 40,817.74; Nifty slips 27.60 pts to 12,025.35. PTI  ANS
యుద్ధ భయాలతో స్టాక్​ మార్కెట్లకు స్వల్ప నష్టాలు

By

Published : Jan 8, 2020, 3:55 PM IST

Updated : Jan 8, 2020, 4:25 PM IST

అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు సహా 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి 5 శాతానికే పరిమితం కానుందన్న ప్రభుత్వ అంచనాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. గత ట్రేడింగ్​లో లాభాలను గడించిన సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 52 పాయింట్లు కోల్పోయి 40,817 వద్ద ముగిసింది. ఓ దశలో 400 పాయింట్లు పతనమైన సూచీ... అనంతరం కోలుకొని స్వల్ప నష్టాలతో ముగించింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 28 పాయింట్లు పతనమై 12,025 పాయింట్లకు చేరింది.

లాభాల్లోని షేర్లు

సెన్సెక్స్​లోని ముప్పై షేర్లలో భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు లాభాలతో మగిశాయి. నేటి ట్రేడింగ్​లో ఈ షేర్లన్నీ దాదాపు 2.74 శాతం రాణించాయి.

నష్టాల్లోని షేర్లు

ఎల్​ అండ్ టీ షేర్లు అత్యధికంగా 2.19 శాతం నష్టపోయింది. ఓఎన్​జీసీ, టైటాన్, సన్​ ఫార్మా, హీరో మోటోకార్ప్​, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.

ముడి చమురు ధరలు 0.62 శాతం పెరిగాయి. బ్యారెల్ ముడిచమురు ధర 68.67 అమెరికన్ డాలర్లకు చేరుకుంది.

రూపాయి మారకం

నేటి ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా క్షీణించింది. ఓ దశలో 20 పైసలు కోల్పోయిన రూపాయి మారకం విలువ చివరకు కోలుకొని 3 పైసల నష్టాన్ని చవిచూసింది. అమెరికా డాలర్​తో పోలిస్తే 71.78కి చేరుకుంది.

ఆసియా, ఐరోపా మార్కెట్లు

అమెరికా-ఇరాన్​ ఉద్రిక్తతలు ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగా ప్రభావం చూపించాయి. షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్​ స్టాక్​మార్కెట్లు 1.57 శాతం మేర నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Jan 8, 2020, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details