తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు స్వల్ప లాభాలు- రాణించిన బ్యాంక్​ షేర్లు

స్టాక్ మార్కెట్లు వారంలో తొలి సెషన్​ను స్వల్ప లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగింది. బ్యాంకింగ్, లోహ రంగాలు రాణించాయి.

stocks close in profit
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

By

Published : Mar 8, 2021, 3:39 PM IST

స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 36 పాయింట్లు పెరిగి 50,441 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 14,956 వద్ద స్థిరపడింది.

1.9 ట్రిలియన్ డాలర్ల కారోనా ప్యాకేజీ బిల్లుకు అమెరికా సెనేట్​ ఆమోదం తెలపడం, అగ్రరాజ్యంలో ఉద్యోగాల కల్పన వేగవంతంగా కొనసాగుతోందన్న వార్తలు అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచాయి. దీనితో దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలను గడించాయి. ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు ఆరంభంలో సానుకూలంగా స్పందించినా.. చివరకు నష్టాలను మూటగట్టుకున్న కారణంగా దేశీయ సూచీలు స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,985 పాయింట్ల అత్యధిక స్థాయి, 50,370 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,111 పాయింట్ల గరిష్ఠ స్థాయి 14,935 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఓఎన్​జీసీ, ఎల్​&టీ, హెచ్​సీఎల్​టెక్​, యాక్సిస్​ బ్యాంక్, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

బజాజ్​ ఫినాన్స్, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, అల్ట్రాటెక్​ సిమెంట్, బజాజ్ ఆటో, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన.. షాంఘై, టోక్యో సియోల్, హాంకాంగ్ సూచీల సోమవారం​​ నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి:కుటుంబ ఆర్థిక భద్రతకు మహిళా భరోసా

ABOUT THE AUTHOR

...view details