అంతర్జాతీయ ప్రతికూలతలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 196 పాయింట్లు కోల్పోయి 37,686 వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 11,192 వద్ద నిలిచింది. ఆటోమొబైల్ షేర్లు భారీగా నష్టపోయాయి.
టాటామోటార్స్, వేదాంత, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, మారుతీ షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీలోని అన్ని విభాగాలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
ఆటో రంగ షేర్లు అత్యధికంగా నష్టాల్లో ఉండటం వల్ల ఆ రంగానికి చెందిన సూచీ 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. వాహనాలకు డిమాండ్ తగ్గడం, రెగ్యులేటరీ ఒడిదొడుకుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.
లాభాల్లో...