తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యం భయాలతో మార్కెట్లకు మళ్లీ నష్టాలే

కరోనా భయాలతో స్టాక్​ మార్కెట్లు మరోమారు నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్​ 173 పాయింట్ల నష్టపోయి 30వేల దిగువకు చేరింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 8,749 వద్ద స్థిరపడింది.

Sensex
మాంద్యం భయాలతో మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు

By

Published : Apr 8, 2020, 3:52 PM IST

కరోనా ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ మార్కెట్లు నేడు మళ్లీ నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం నుంచి ఒడుదొడుకుల్లో కొనసాగుతూ.. చివరకు నష్టాల్లో ముగిశాయి. నిన్న భారీ లాభాలతో దూసుకెళ్లి 30వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్​ ఆ మార్కును కాపాడుకోలేకపోయింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​- 173 పాయింట్లు కోల్పోయి 29,893 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 43 పాయింట్లు నష్టంతో 8,749 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి..

వేదాంత, సన్​ఫార్మా, సిప్లా, సిప్లా, ఎన్​టీపీసీ, భారతీయ ఎయిర్​టెల్​ లాభపడ్డాయి.

టీసీఎస్​, టైటాన్​ కంపెనీ, శ్రీ సిమెంట్​, హిందాల్కో, బీపీసీఎల్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details