తెలంగాణ

telangana

ETV Bharat / business

'అక్టోబరు 29 వరకు కఠిన నిఘా చర్యలు'

నిఘా చర్యలను అక్టోబర్​ 29వరకు కొనసాగిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊగిసలాటలను నియంత్రించడానికే ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

By

Published : Sep 19, 2020, 7:59 AM IST

Sebi extends security measures to curb volatility till oct 29
'అక్టోబరు 29 వరకు కఠిన నిఘా చర్యలు'

మార్కెట్లో ఊగిసలాటలకు అదుపులో ఉంచడం కోసం అక్టోబరు 29 వరకు నిఘా చర్యలను కొనసాగించాలని నిర్ణయించినట్లు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో మార్కెట్‌లో పొజిషన్‌ పరిమితుల సవరణతో పాటు పలు చర్యలను మార్చిలో సెబీ చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితులను సమీక్షించిన అనంతరం మార్చి 20, 2020 నాడు తీసుకొచ్చిన చర్యలను వచ్చే నెల 29 వరకు కొనసాగించాలని నిర్ణయించామని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సెబీ వెల్లడించింది.

ఇదీ చూడండి:-మల్టీక్యాప్ ఫండ్లకు సెబీ కొత్త నిబంధనలు

ABOUT THE AUTHOR

...view details