తెలంగాణ

telangana

ETV Bharat / business

బిగ్​ బుల్​కు బేర్​ దెబ్బ- 10 నిమిషాల్లో రూ.230 కోట్లు ఉఫ్​!

Rakesh Jhunjhunwala Portfolio: దిగ్గజ మదుపరి రాకేశ్​ ఝున్​ఝున్​వాలా కేవలం పది నిమిషాల్లో రూ. 230 కోట్లు సంపద కోల్పోయారు. టైటాన్​, టాటా మోటార్స్​ షేర్లు పతనం అవడమే ఇందుకు కారణం.

Rakesh Jhunjhunwala
రాకేశ్​ ఝున్​ఝున్​వాలా

By

Published : Dec 20, 2021, 2:33 PM IST

Rakesh Jhunjhunwala Portfolio: స్టాక్​మార్కెట్​ కుప్పకూలడం మదుపర్లకు తీవ్ర నష్టాన్ని మిగల్చింది. బిగ్​ బుల్​గా పేర్కొనే దిగ్గజ మదుపరి రాకేశ్​ ఝున్​ఝన్​వాలా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆయన పెట్టుబడి పెట్టిన టైటాన్​, టాటా మోటార్స్​ సంస్థల షేర్లు కుదేవలడం భారీ నష్టాన్ని కలిగించింది. కేవలం 10 నిమిషాల్లో ఝన్​ఝున్​వాలాకు చెందిన దాదాపు రూ.230 కోట్ల సంపద ఆవిరైంది.

నష్టాల్లోకి ఇలా..

మార్కెట్​ ప్రారంభ సమయానికి టైటాన్​ సంస్థ షేర్​ విలువ రూ.22.70 నష్టంతో రూ.2280.40గా ఉండేది. కానీ కాసేపటికే షేర్​ విలువ రూ.2241.10కి చేరుకుంది. దీంతో కేవలం 10 నిమిషాల్లోనే షేర్​కు​ రూ. 39.30 చొప్పున తగ్గిపోయింది.

టైటాన్​లో రాకేశ్​కు 3,37,60,395 షేర్లు ఉండగా ఆయన సతీమణి రేఖా ఝున్​ఝున్​వాలా 95,40,575 షేర్లు కొనుగోలు చేశారు. వీరిద్దరికీ కలిపి మొత్తం 4,33,00,970 షేర్లు ఉన్నాయి.

అదే విధంగా స్టాక్​మార్కెట్​ ప్రారంభమయ్యే సమయానికి టాటా మోటార్స్​ సంస్థ షేర్​ విలువ రూ. 10.30 నష్టంతో రూ.470.20గా ఉండేది. కానీ పది నిమిషాల్లో షేర్​కు రూ.15.90 తగ్గి ఈ విలువ రూ. 454.30కు చేరుకుంది. టాటా మోటార్స్​లో రాకేశ్​కు 3,67,50,000 షేర్లు ఉన్నాయి.

మార్కెట్​ దెబ్బకు రాకేశ్​కు చెందిన రూ.170 కోట్లు (టైటాన్​), రూ.60 కోట్లు (టాటా మోటార్స్​) సంపదకు గండి పడింది.

అయితే ఈ స్టాక్స్​.. మార్కెట్​ ముగిసే సమయానికి కోలుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 'టైటాన్​ స్టాక్స్​ విలువ ప్రస్తుతం రూ.2150 నుంచి రూ.2300 మధ్య ఉన్నాయి. ఇవి రూ.2300 దాటితే కోలుకునే అవకాశం ఉంటుంది. టాటా మోటార్స్​ షేర్ల విలువ కూడా రూ.460 దాటితే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి :మార్కెట్లపై బేర్​ పంజా.. సెన్సెక్స్​ 1000 పాయింట్లు డౌన్​

ABOUT THE AUTHOR

...view details