మీడియా, విమానయానం, బీమా, సింగిల్ బ్రాండ్ రిటైళ్ల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేలా నిబంధనలను సడలించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ దిశగా భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. 2018 -19 లో ఎఫ్‌డీఐలు 6 శాతం పెరిగాయన్నారు. ప్రపంచంతో పోలిస్తే ఎఫ్‌డీఐలు భారత్‌కు మెరుగ్గా ఉన్నాయన్న ఆర్థిక మంత్రి... మధ్యంతర బీమాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానిస్తూ కేంద్ర పద్దుల్లో ప్రతిపాదనలు చేశారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో స్థానిక నింబంధనలు సరిళీకృతం చేస్తామని చెప్పారు. దేశంలో ఏటా అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేయడానికి మరో ప్రతిపాదనను సభ ముందుంచారు. స్టాక్‌మార్కెట్లలో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ విత్త మంత్రి ప్రతిపాదించారు. ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు విదేశీ పోర్టు ఫోలియో గుర్తింపు ఇస్తామని చెప్పారు.
''ప్రత్యక్ష పెట్టుబడులకు స్వర్గధామంగా భారత్''
భారత్‌ను ఎఫ్‌డీఐలకు స్వర్గధామంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మధ్యంతర బీమాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానిస్తూ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు.
fdi