భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో స్టాక్మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 36,141.07 పాయింట్ల వద్ద ప్రారంభమైన బాంబే ఎక్స్చేంజి సూచీ - సెన్సెక్స్ 51 పాయింట్ల వృద్ధిలో ఉంది. 10,864.85 పాయింట్ల వద్ద మొదలైన జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 0.18 శాతం ఎగబాకింది.
చైనా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు సహా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందానికి ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా... ఉదయం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. కాసేపటికి కోలుకున్నాయి. సెన్సెక్స్ సూచీలో ఉత్పాదక వస్తువులు, ఐటీ రంగ షేర్లు బలహీనంగా ఉన్నాయి.
శుక్రవారం సెషన్లో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభపడి 35,063.81 పాయింట్లు, నిఫ్టీ 10,863.50 పాయింట్ల వద్ద ముగిశాయి.