తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రతికూలతల నడుమ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు.. - సానుకూల సంకేతాలు

భారీగా విదేశీ నిధుల ప్రవాహం, దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 280పైగా పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 72 పాయింట్లు పతనమైంది.

స్టాక్​మార్కెట్లకు నష్టాలే

By

Published : Jul 22, 2019, 9:48 AM IST

Updated : Jul 22, 2019, 11:00 AM IST

చివరి వారాంతంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న సూచీలు.. నేడూ నష్టాలతోనే ప్రారంభించాయి. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు.. భారీగా విదేశీ నిధుల ప్రవాహంతో నష్టాల బాట పట్టాయి మార్కెట్లు.

లోహ మినహా.. ఐటీ, బ్యాంకింగ్​, ఇన్​ఫ్రా, ఫార్మా రంగాల్లో కొనుగోళ్ల మందగమనమూ నష్టాలకు ఓ కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 282 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం.. 38 వేల 54 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 11 వేల 350 పాయింట్ల దిగువన ట్రేడవుతోంది. ప్రసుతం..72 పాయింట్లు క్షీణించి 11 వేల 347 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివివే....

వేదాంత, టాటా మోటర్స్​, యస్​ బ్యాంక్​, భారతీ ఇన్​ఫ్రాటెల్​, సన్​ ఫార్మా లాభాలను ఆర్జించాయి. బజాజ్​ ఫినాన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, కోటక్​ బ్యాంక్​, ఓఎన్​జీసీలు 2.85 శాతం మేర నష్టపోయాయి.

రూపాయి...

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి 22 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ.. 69.02 వద్ద ఉంది.

ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోసిట్​ సూచీ, హాంగ్​ సెంగ్​, నిక్కీ, కోస్పీలు ప్రతికూలంగానే ప్రారంభమయ్యాయి.

Last Updated : Jul 22, 2019, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details