తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ సమీక్షపై ఆశలు- సెన్సెక్స్​​ 887 ప్లస్​ - స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

Stock Market Today India: ఒమిక్రాన్​ భయాలు ఉన్నప్పటికీ.. భారీ కోనుగోళ్లతో దేశీయ స్టాక్​ మార్కెట్లలో బుల్​ జోరు కొనసాగింది. సెన్సెక్స్​ 887 పాయింట్లకుపైగా లాభంతో 57,634 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 264కుపైగా పాయింట్లు లాభపడింది.

stock market
స్టాక్స్​మార్కెట్​

By

Published : Dec 7, 2021, 3:40 PM IST

Stock Market Today India: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు పెద్ద ఎత్తున కొనుగోళ్లు వెల్లువెత్తగా స్టాక్​మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి. ఒమిక్రాన్​ భయాలు ఉన్నప్పటికీ.. బుధవారం వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలు సానుకూలంగానే ఉంటాయనే సూచనలు మదుపరుల ఆశలకు ప్రాణం పోశాయి. దీంతో అన్ని రంగాల షేర్లు పెరిగాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ​887 పాయింట్లు లాభంతో 57,634పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఇంట్రాడేలో.. 57,126 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ లాభాల్లో కొనసాగింది. తొలుత 56,992 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్​.. కీలక రంగాల్లో మద్దతుతో ఒక దశలో వేయి పాయింట్లకు పైగా పుంజుకుని 57,905 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 264 పాయింట్ల వృద్ధితో 17,177 వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో.. 17,044 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒకనొక దశలో 16,987 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. కీలక రంగాలు పుంజుకోవటం వల్ల 17,251 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది.

లాభనష్టాల్లోనివి...

ముప్పై షేర్ల ఇండెక్స్​లో... ఏషియన్​ పెయింట్స్​ ఒక్కటే నష్టాల్లో ముగిసింది.

ఇవీ చూడండి:

అమెజాన్​ ప్రైమ్ సబ్​స్క్రిప్షన్​ ఛార్జ్​ భారీగా పెంపు- సోమవారం నుంచే...

కొత్త సంవత్సరం నుంచి ఏటీఎం ఛార్జీల మోత!

ABOUT THE AUTHOR

...view details