వరుస నష్టాలకు బ్రేకులు వేస్తూ లాభాలతో ఆరంభమైన స్టాక్ మార్కెట్లు.. చివరకు ఐదోరోజూ నష్టాల్లోనే ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ సూచీ- సెన్సెక్స్ 585 పాయింట్లు తగ్గి 49,217 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ- నిఫ్టీ 163 పాయింట్లు కోల్పోయి 14 వేల 556 వద్ద ముగిసింది. బ్యాకింగ్, ఫార్మా రంగాల్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,296 పాయింట్ల అత్యధిక స్థాయిని; 48,962 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 15,875 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,479 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభాల్లో ఉన్న షేర్లు..