అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ సూచీ- సెన్సెక్స్ 562 పాయింట్లు తగ్గి 49,802 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 189 పాయింట్లు కోల్పోయి 14 వేల 721 వద్ద ముగిసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు.. ఆటో, లోహ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,561 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి.. 49,719 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
మరో సూచీ నిఫ్టీ 14,957 పాయింట్ల గరిష్ఠాన్ని, 14,696 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభాల్లో ఉన్న షేర్లు..
ఐటీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ షేర్లు స్వల్ప లాభాలను ఆర్జించగా.. ఇతర ప్రధాన కంపెనీల షేర్లన్నీ నష్టాల్లో కొనసాగాయి.
నేటి సెషన్లో ఓఎన్జీసీ షేరు అధికంగా నష్టపోయి.. 5 శాతం మేర తగ్గింది. బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, ఎస్బీఐఎన్, ఎన్టీపీసీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఈక్విటీ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.