తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూలతల నడుమ లాభాల్లో మార్కెట్లు - బజాజ్​

మంగళవారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 148 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 42 పాయింట్లు వృద్ధి చెంది 10968 వద్ద కొనసాగుతోంది. గత సెషన్​లో నష్టపోయిన బ్యాంకింగ్​ షేర్లు గణనీయంగా పుంజుకున్నాయి.

అంతర్జాతీయ సానుకూలతల నడుమ లాభాల్లో మార్కెట్లు

By

Published : Aug 14, 2019, 10:27 AM IST

Updated : Sep 26, 2019, 11:10 PM IST

బ్యాంకింగ్​,లోహ​,ఆటో రంగం షేర్లు పుంజుకోవడం వల్ల దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా, మళ్లీ పుంజుకుంది. అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూలతలు లేకపోవడమూ లాభాలకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 148 పాయింట్లు పెరిగి 37,106 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 42 పాయింట్లు వృద్ధి చెంది 10,968 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో...

బ్యాంకింగ్‌, మిడ్‌ క్యాప్స్‌ షేర్లు లాభపడుతున్నాయి. యూపీఎల్‌, బజాజ్‌ ఫినాన్స్​, టాటా స్టీల్‌, రిలయన్స్‌, వేదాంత, యాక్సిస్‌ బ్యాంకు, అపోలో హాస్పిటల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాలు...

డా. రెడ్డీస్‌, యస్‌ బ్యాంకు, సన్‌ఫార్మా, పవర్‌ గ్రిడ్‌, ఐఓసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఫార్మా రంగం షేర్లు భారీ నష్టాల్లో సాగుతున్నాయి.

రూపాయి..

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 55 పైసలు బలపడి రూ.70.85 వద్ద ఉంది.

Last Updated : Sep 26, 2019, 11:10 PM IST

ABOUT THE AUTHOR

...view details