స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 637 పాయింట్లకు పైగా లాభపడి 50,220 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 190 పాయింట్లుకు పైగా పుంజుకుని 15,113 వద్ద కొనసాగుతుంది.
దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. దీంతో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. అంతేగాక విదేశీ సంస్థాగత పెట్టుబడులు మార్కెట్‌కు అండగా నిలిచాయి. దీంతో సూచీలు లాభాల బాట పట్టాయి.
లాభనష్టాలు..
- పవర్‌గ్రిడ్, బజాజ్ ఫినాన్స్, టైటాన్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్ర, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
- ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.