తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2020, 9:32 AM IST

Updated : Jul 20, 2020, 3:50 PM IST

ETV Bharat / business

ఆర్థిక, ఐటీ షేర్ల జోరు.. సెన్సెక్స్ 399 ప్లస్​

STOCKS LIVE
అంతర్జాతీయంగా ప్రతికూలతలున్నా లాభాల్లో మార్కెట్లు

15:39 July 20

బ్యాంకింగ్, ఐటీ షేర్ల జోరు..

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 399 పాయింట్లు బలపడి 37,419కి చేరింది. నిఫ్టీ 120 పాయింట్లు బలపడి 11,022 వద్దకు చేరింది.

  • ఆర్థిక, ఐటీ షేర్ల జోరు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
  • బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్​సర్వ్, హెచ్​సీఎల్​టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
  • సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, మారుతీ, కోటక్ బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

09:47 July 20

37,400 చేరువలో సెన్సెక్స్..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 360 పాయింట్లకుపైగా లాభంతో 37,382 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా బలపడి నాలుగు నెలల తర్వాత తొలిసారి 11,000 మార్క్​ను దాటింది.

కరోనా సంక్షోభంలోనూ ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో  హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 19.6 శాతం లాభాలను ప్రకటించిన నేపథ్యంలో షేర్లు 4 శాతానికిపైగా పుంజుకున్నాయి. వీటికి తోడు ఇతర బ్యాంకింగ్ షేర్లు, ఐటీ రంగం సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు ప్రధాన కారణం.

  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, ఎస్​బీఐ, ఇన్ఫోసిస్​లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • సన్​ఫార్మా, కోటక్ బ్యాంక్, నెస్లే, మారుతీ, టైటాన్, హెచ్​యూఎల్​ నష్టాల్లో ఉన్నాయి.

09:17 July 20

అంతర్జాతీయంగా ప్రతికూలతలున్నా లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నా.. దేశీయ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్​ ఆరంభ ట్రేడింగ్​లో 366 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 37 వేల 386 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 11 వేల ఎగువకు చేరింది. 

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, కోల్​ ఇండియా, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​ రాణిస్తున్నాయి. 

సన్​ ఫార్మా, టాటా మోటర్స్​, టైటాన్​ కంపెనీ, కోటక్​ మహీంద్రా నష్టాల్లో ఉన్నాయి. 

Last Updated : Jul 20, 2020, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details