తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2020, 9:34 AM IST

Updated : Nov 4, 2020, 10:46 AM IST

ETV Bharat / business

అమెరికా ఫలితాల సరళితో లాభాల్లో మార్కెట్లు

stocks
దేశీయ స్టాక్ మార్కెట్లు

10:42 November 04

లాభాల్లోనే మార్కెట్లు..

దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 40,429 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 11,863 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

అమెరికా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఐటీ షేర్లు పుంజుకున్నాయి. ఫలితాల సరళి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌కు అనుకూలంగా కొనసాగుతుండడం మదుపర్ల సెంటిమెంటును బలపరిచింది.

లాభనష్టాల్లో..

ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు వెనకబడ్డాయి.

ఆసియా మార్కెట్లు..

షాంఘై, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.  

చమురు..

అంతర్జాతీయ మార్కెట్​లో బ్రెంట్ చమురుర ధర 1.56 శాతం పెరిగి బ్యారెల్​కు 40.33 డాలర్ల వద్ద కొనసాగుతోంది.  

09:23 November 04

అమెరికా ఎన్నికల ఫలితాల సరళితో లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 245 పాయింట్లు పెరిగి 40,506 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

నిఫ్టీ 66 పాయింట్లు మెరుగై 11,880 పాయింట్లకు చేరింది.  

లాభనష్టాల్లో..

ఇన్ఫోసిస్, సన్​ఫార్మా, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్​, టీసీఎస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.  

పవర్​గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి. 

Last Updated : Nov 4, 2020, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details