తెలంగాణ

telangana

ETV Bharat / business

చమురు యుద్ధంతో కుప్పకూలిన గల్ఫ్ స్టాక్ మార్కెట్లు

సౌదీ-రష్యా చమురు యుద్ధంతో పశ్చిమాసియా దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 9.5 శాతం పతనమైన కువైట్​ ప్రీమియర్​లో ట్రేడింగ్ నిలిపేశారు. రష్యా రూబుల్​ 7 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

oil
చమురు

By

Published : Mar 9, 2020, 1:56 PM IST

Updated : Mar 9, 2020, 2:19 PM IST

చమురు ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో పశ్చిమ ఆసియా దేశాల స్టాక్​ మార్కెట్లు ప్రారంభ సెషన్​లోనే కుప్పకూలాయి. కువైట్ ప్రీమియర్ సూచీ​ 9.5శాతం పతనం కావటం వల్ల ట్రేడింగ్​ను నిలిపేశారు.

దుబాయి ఫైనాన్షియల్​ మార్కెట్​ 9శాతం, అబుదబీ సెక్యురిటీస్ ఎక్స్ఛేంజి 7.1 శాతం పడిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ ఆరాంకో షేర్లు 10 శాతం కోల్పోయాయి.

రూబుల్ పతనం..

చమురు ధరల పతనంతో రష్యా కరెన్సీ రూబుల్​ కూడా భారీగా పతనమైంది. 7 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరింది. డాలరుతో పోలిస్తే రూబుల్ మారకం విలువ 74గా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సోమవారం ఏకంగా 25 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇంధన ఉత్పత్తుల విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తాయి. ఫలితంగా చమురు ధరలను భారీగా తగ్గించింది సౌదీ.

Last Updated : Mar 9, 2020, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details